ఏపీ తనిఖీల్లో 100 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, బంగారం స్వాధీనం: మీనా

54చూసినవారు
ఏపీ తనిఖీల్లో 100 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, బంగారం స్వాధీనం: మీనా
ఏపీలో ఇప్పటి వరకూ నిర్వహించిన తనిఖీలలో 100 కోట్ల రూపాయలు విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాల్లో సోదాలను విస్తృతం చేశామన్నారు. తనిఖీ చేసేటప్పుడు సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా నడుచుకోవాలని బృందాలకి ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్