కర్ణాటక రాష్ట్రంలోని ముద్దేనహళ్లి గ్రామంలో 1861 సెప్టెంబరు 15న శ్రీనివాసశాస్త్రి, వెంకటలక్ష్మమ్మ దంపతులకు విశ్వేశ్వరయ్య జన్మించారు. చిక్ బళ్లాపూర్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మృతి చెందారు. ఆ తర్వాత మేనమామ సహకారంతో బెంగుళూరులో మెట్రిక్యులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1881లో బీఎ పట్టా పొందారు. తర్వాత పుణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఉన్నతవిద్య అభ్యసించారు.