వైఎస్ జగన్‌పై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎక్స్ వేదికగా.. ‘4 ఏళ్ల క్రితం మంజూరైన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కాలేదు. మెడికల్ కౌన్సిల్ జులైలోనే అనుమతిని నిరాకరించిన విషయం జగన్‌కు తెలుసు. 48 శాతం బోధన సిబ్బంది లేరన్న విషయాన్ని జగన్ మరిచారా? సర్దుకుందామనుకుంటే మరి పాఠాలు ఎవరు చెప్పాలి. మీరు చెప్తారా ప్రొఫెసర్ జగన్.’ అని ప్రశ్నించారు.