విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఫోకస్

59చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఫోకస్
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా కేంద్రం ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి గురువారం విశాఖలో పర్యటించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటనకు రానుండటంతో స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్