వివిధ రంగుల్లో ఉండే క్యాప్సికమ్‌కు మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉంది. భారత్‌లో క్యాప్సికం దాదాపు 4780 హెక్టార్లలో సాగు అవుతోందని, దీని వార్షిక ఉత్పత్తి 42230 టన్నులుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి హోటళ్లలో అత్యధిక డిమాండ్ ఉంది. ఒక హెక్టారులో దాదాపు 300 క్వింటాళ్ల క్యాప్సికం ఉత్పత్తి అవుతుంది. క్యాప్సికమ్‌ను సాగు చేస్తే రైతులు లక్షల్లో లాభాలు పొందవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.