తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరువూరు పట్టణం బోసుబొమ్మ వద్దకు ఈరోజు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేరుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలించారంటూ సాక్షి మీడియాకి, వైసీపీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించిన వైసీపీ నేతలు బహిరంగంగా చర్చించేందుకు బోసుబొమ్మ సెంటర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటుచేసుకుంది.