రేపు (సెప్టెంబర్ 7) వినాయక చవితి పండుగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడిని మనసారా వేడుకుంటున్నట్లు పవన్ తెలిపారు.