ఉత్తరప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి జ్యూస్ తయారు చేస్తూ అందులో ఉమ్ముతూ కెమెరాకు చిక్కాడు. యూపీలోని షామ్లీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో సదర్ కొత్వాలి పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.