చనిపోవడానికైనా నేను సిద్ధం: పవన్

61చూసినవారు
చనిపోవడానికైనా నేను సిద్ధం: పవన్
సనాతన ధర్మం కోసం తాను చనిపోవడానికి కూడా సిద్ధమేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం విజయవాడ కనకదుర్గ ఆలయంలో పవన్ మాట్లాడుతూ.. ‘కొన్ని దశాబ్దాలుగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మౌనంగా ఉన్నామంటే బాధ లేదని కాదు. హిందువుల నమ్మకాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎవరూ క్షమించరు. సగటు హిందువుకు ఎప్పుడూ ఇతర మతాల వారిపై ధ్వేషం ఉండదు. సనాతన ధర్మం కోసం పోరాటం మొదలు పెడితే తాను చనిపోవడానికి కూడా సిద్ధం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్