స్వచ్ఛంద సంస్థ ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐసీపీఎఫ్) బాల్య వివాహాలపై విడుదల చేసిన పరిశోధన పత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 4,452 మైనర్ బాలికలకు వివాహం జరుగుతోందని, నిమిషానికి ముగ్గురు బాలికలు బలవుతున్నారని తెలిపింది. అయినా రోజుకు మూడు బాల్య వివాహాల కేసులే నమోదవుతున్నాయని పేర్కొంది.