ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. సమావేశంలో అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం.. మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్లు వేగంగా అందేలా చూడాలని ప్రధానిని చంద్రబాబు కోరారు. పోలవరం నిర్మాణం వేగంగా జరిగేలా ఆర్థిక వనరులు సమకూర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించాలని.. ఏపీ పర్యాటనకు రావాలని ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు.