ఎంతో మంది చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపించేందుకు ముఖ్య కారణం తినే ఆహారాలు. పంచదార, కెఫిన్ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే వయసు పెరిగిన వారిలా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన ధూమపానం, మద్యపానం చేయడం, ఎండలో ఎక్కువగా తిరగడం, సరిగా నిద్ర లేకపోవడంతో.. వయసు పైబడిన వారిగా కనిపిస్తారని అంటున్నారు. అంతేకాకుండా నూనె పదార్థాలు ఎక్కువగా తినడం, నీళ్లు సరిగా తాగకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు.