వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి చంద్రబాబు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్‌పై చంద్రబాబు ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వైసీపీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్‌ను నెల్లూరు సెంట్రల్ జైలుకు బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.