మహిళను వేధించి కాళ్ళు మొక్కించుకున్న యువకులు (వీడియో)

60చూసినవారు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వీధి కుక్కను ఎందుకు హింసిస్తున్నారని ప్రశ్నించిన పెట్రోల్ బంక్ మహిళా సిబ్బందిని ముగ్గురు యువకులు వేధించారు. ఆమెతో వాగ్వాదానికి దిగిన ఓ యువకుడు తమ కాళ్లు మొక్కి క్షమాపణ చెప్పాలని బెదిరించాడు. ఆమె వారి కాళ్లు మొక్కుతూ 'నన్ను క్షమించండి' అని కేకలు వేయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్