విమానంలో ప్రయాణించడమంటే ఎవరికి ఇష్టముండదు. కానీ ధరలను చూసి అనేక మంది ఆగిపోతుంటారు. అయితే అటువంటి వారికి దేశీయ, అంతర్జాతీయ విమాన రేట్లపై డిస్కౌంట్లను అందించే ‘న్యూ ఇయర్ సేల్’ ప్రారంభమైంది. ఈ ఆఫర్‌లో వన్ వే టికెట్ ధర రూ.1,599 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ప్రత్యేక ఆఫర్ 2024 డిసెంబర్ 31 నుంచి 2025 జనవరి 3 మధ్య బుక్ చేసిన టికెట్లపై మాత్రమే వర్తిస్తుంది.