కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని ఏపీ హైకోర్టు జడ్జి సుబ్బారెడ్డి సట్టి కుటుంబసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.