

పూతలపట్టు: ఇంట్లోకి చేరిన వర్షపు నీరు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి మండలంలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం కురిసిన వర్షానికి మండల పరిధిలోని దాసరపల్లిలో ఓ వ్యక్తి ఇంటి పైకప్పు ఏగిరిపోవడంతోపాటు ఇంట్లోకి నీరు చేరింది. వర్షం వస్తున్న సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందనీ స్థానికులు తెలిపారు.