చిత్తూరు: ప్రధాన అర్చకుడు సస్పెండ్: ఆలయ ఈఓ
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న సోమశేఖర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఈవో గురుప్రసాద్ మంగళవారం తెలిపారు. రవికుమార్ అనే వ్యక్తి దేవదాయ శాఖకు ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా తీసుకొని సమగ్ర విచారణ జరిపిన అనంతరం, కమిషనర్ ఆదేశాల వరకు ఆయన్ని విధుల నుంచి తొలగించామన్నారు. ప్రధాన అర్చకుడి నుండి దీనిపై వివరణ కోరినట్లు పేర్కొన్నారు.