తిరుపతి: మంత్రికి ఘన స్వాగతం పలికిన కిరణ్ రాయల్
రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి చేరుకున్న రాష్ట్ర పౌరుసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఘనస్వాగతం లభించింది. శనివారం తిరుపతి విమానాశ్రయంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్, పార్టీ శ్రేణులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి స్వాగత పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కాసేపు ముచ్చటించారు.