కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కట్టుబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ లో తిరుపతి జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై కలెక్టర్, అధికారులతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.