రెవెన్యూశాఖ మంత్రి అనగాని తిరుపతి జిల్లాకు రాక
రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న సోమవారం మంత్రి తిరుపతి నగరంలో స్థానిక కార్యక్రమాలలో పాల్గొని రాత్రి బస చేయనున్నారని, 29నతిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు.