తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో కొండలను గుట్టలను అక్రమార్కులు మాయం చేస్తున్నారు. భూమి విలువ రోజురోజుకూ పెరిగిపోతూ ఉండడంతో అక్రమార్కులు కొండలు గుట్టలు చదును చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారని, అధికారులకు చెబితే పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రకృతి వనరులను కాపాడాలని ఎలమంద గ్రామస్తులు కోరుతున్నారు.