చంద్రగిరి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సీఐగా ఫణీంద్ర, ఎస్ఐలు ఎం. సుధాకర్, కె. గిరితో పాటు ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఆరుగురు కానిస్టేబుళ్లు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. తాడిపత్రి నుంచి బదిలీపై ఈయన చంద్రగిరికి వచ్చారు. చంద్రగిరిలోని ఎక్సైజ్ ఎస్ఐ జయశంకర్ తిరుపతి అర్బన్ కు బదిలీ అయ్యారు. ఓబులాపురం చెక్ పోస్ట్ లో ఎస్ఐగా ఉన్న కె. గిరి, ప్రొద్దుటూరులో ఎస్ఐగా ఉన్న ఎం. సుధాకర్ బదిలీపై చంద్రగిరికి వచ్చారు.