చిత్తూరు నగరంలోని స్థానిక రుక్మిణీకృష్ణ స్వామి విద్యాలయ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డేకి ముఖ్య అతిథిగా శనివారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. బద్రీనారాయణ అధ్యక్షతన విద్యాలయ వ్యవస్థాపకులు డీకే ఆదికేశవులు, సత్యప్రభ చిత్ర పటాలకు నివాళి అర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంత ఎదిగినా సొంత గడ్డని చదువు చెప్పిన గురువుని మరవకండి అన్నారు.