ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు తీర్చాలి

1225చూసినవారు
ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు తీర్చాలి
చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండలం గర్నిమిట్ట, జిల్లెళ్లమంద ప్రాథమిక ఆరోగ్యకేంద్రలలో ఆశా డే సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐటీయూసీ పీలేరు డివిజన్ ప్రధాన కార్యదర్శి జానం గంగిరెడ్డి మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు రెండు విడతలుగా జీతం విడుదల చేస్తున్నారని అలా కాకుండా పదివేలు రూపాయిలు ఒకేసారి జీతం రూపంలో విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆశా వర్కర్ల పై రాజకీయ వేధింపులు మానుకోవాలని, రేషన్ కార్డులు తొలగించారాదని, అర్హులైన ఆశా వర్కర్లకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల బాద్యుడు చీనేపల్లె నాగేంద్ర, ఆశావర్కర్ల నాయకురాళ్ళు సుమిత్ర, ఎర్రమ్మ, లక్ష్మీదేవి, ధనలక్ష్మి, కల్యాణి, రెడ్డిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్