భారతీయులను బ్రిటీష్ అధికారులు చిన్నచూపు చూడటాన్ని విశ్వేశ్వరయ్య సహించలేకపోయేవారు. అన్ని విధాలా తాను చీఫ్ ఇంజినీర్ పదవికి అర్హుడినైనా, ఆ పోస్టు బ్రిటీష్ వారికే కేటాయించడాన్ని నిరసిస్తూ తన ఉద్యోగానికి 1908లో రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను చూసిన గవర్నర్ సిడెన్హాం ఆశ్చర్యపోయారు. అప్పటికి ఆయన ఉద్యోగంలో చేరి 23 ఏళ్లు అయింది. మరో రెండేళ్లు పనిచేస్తే పింఛను లభించేది. గవర్నర్ ఆయనకు పూర్తి పింఛను మంజూరు చేస్తూ, రాజీనామానూ అంగీకరించారు.