మానవాళికే కాకుండా ఇతర జంతుజాలానికీ, పర్యావరణానికి ప్లాస్టిక్ కాలుష్యం పెనుముప్పుగా మారుతుంది. ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో 5.2 కోట్ల టన్నులకుపైగా సరైన నిర్వహణ లేక బహిరంగ ప్రదేశాల్లో కాల్చి వేయడంలాంటి చర్యల ద్వారా వాతావరణంలో కాలుష్యంగా కలిసిపోతోంది. ఆహార పదార్థాలు, గాలి, నీటి ద్వారా లోనికి వెళ్లే ఈ సూక్ష్మరేణువులు మన వివిధ అవయవాలపై ముఖ్యంగా మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపి.. అనారోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి.