చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు రాబడిన సమాచారంతో గోపిశెట్టిపల్లి, కనికాపురం గ్రామ పరిధిలో నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. అక్కడ నాటు సారా తయారికి వినియోగించే ఊటను ధ్వంసించినట్లు తెలిపారు. అక్రమంగా నాటు సారాను తయారు చేసేది, విక్రయించిన వారు చట్ట ప్రకారం శిక్ష పొందుతారని ఆయన వెల్లడించారు.