చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని తిలకించిన ప్రజలు

51చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలు పండుగ వాతావరణం లో తిలకించారు. పులిచెర్ల ఎంపిడిఓ కార్యాలయం, పులిచెర్ల మండల పరిధిలోని అన్ని గ్రామ సచివాలయాల్లో అధికారులు ఎల్ఈడి టీవీలు ద్వారా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు అందంగా ముస్తాబు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్