తండ్రిని హతమార్చిన కొడుకు
డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకే తండ్రిని చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. గుడుపల్లె మండలం మిట్టూరు గ్రామానికి చెందిన వెంకటేశ్ పెన్షన్ డబ్బు దాచుకున్నారు. ఇది తెలుసుకున్న ఆయన కుమారుడు సోమశేఖర్ డబ్బులు ఇవ్వాలని కోరాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో సోమశేఖర్ కర్రతో కొట్టి చంపేసి పరార్ అయ్యాడని స్థానికులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.