రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని కోరుతూ కుప్పం మున్సిపాలిటీలోని లక్ష్మీపురం వరదరాజ స్వామి దేవాలయంలో ఆదివారం గణపతి హోమాన్ని నిర్వహించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 114ను అమలు చేయాలని కోరారు. ఇప్పటికే మంగళగిరి, పిఠాపురంలో హోమాలు నిర్వహించామని గుర్తు చేశారు.