తన భర్త చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ కష్టపడి పని చేయాలని కొడుకు నారా లోకేశ్ కు తాను ఎప్పుడూ చెబుతానని నారా భువనేశ్వరి గురువారం పేర్కొన్నారు. నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో నారా భువనేశ్వరి ముఖాముఖి అయ్యారు. తన కళాశాల చదువులకు సంబంధించిన పలు విషయాలను విద్యార్థులతో ఆమె పంచుకున్నారు.