రొంపిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డ్ వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న కాలనీ ఇంటిని ఎంపీపీ పురుషోత్తమ రెడ్డి, జెడ్పీటీసీ రెడ్డి ఈశ్వర్ రెడ్డి, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇబ్రహీం ఖాన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల స్వంత ఇంటి కల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పారు.