మదనపల్లె: వైసీపీ ఎమ్మెల్యేలను తొలగించి ఎన్నికలు జరిపించండి
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలను తొలగించి వెంటనే ఎన్నికలు జరిపించాలని మదనపల్లెకు చెందిన జనసేన నేత మైఫోర్స్ మహేష్ డిమాండ్ చేశారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేసి ఏవోకు వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, భారత రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలను తొలగించి ఎన్నికలు జరిపించాలాన్నారు.జరిపించాలన్నారు.