మదనపల్లి వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎరిషావలి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న చాంద్ భాషా బదిలీపై అన్నమయ్య జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎరిషావలి మాట్లాడుతూ గతంలో మదనపల్లి రెండవ పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా 2010, 11వ సంవత్సరంలో పనిచేసిన అనుభవంతో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని అన్నారు.