చిత్తూరు జిల్లా నగరిలోని దేశమ్మ ఆలయంలో సోమవారం కార్తీక మాసం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఓ భారీ నాగుపాము ఆలయంలోకి వచ్చి హల్చల్ చేసింది. కార్తీక మాసం నాలుగో సోమవారం సందర్భంగా నాగుపాము హఠాత్తుగా ఆలయంలో ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. కొందరు భక్తులు వీడియో తీసుకున్నారు. మరికొందరు ఇది ఆ పరమశివుని కృప అని అన్నారు.