బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురువారం నగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరుగా వర్షం పడుతుంది. వాతావరణ మార్పుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో చిన్నపిల్లలు జలుబు, దగ్గు, జ్వరంతో ఎక్కువగా బాధపడుతున్నట్లు వైద్యాధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా మారుతున్న వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.