పుత్తూరు మున్సిపాలిటీ లోని శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి చెంత బిల్వ లక్షార్చన జ్యోతి పూజ ఉత్సవాలను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి పట్టణ పురవీధులలో మంగళ వాయిద్యాలు పుష్ప విద్యుత్ అలంకరణతో స్వామివారి ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.