సేంద్రీయ ఎరువులను ఉపయోగించి సహజంగా పండించిన పంటలను ఆహారంగా స్వీకరించాలని ఎస్.పీ.ఎం విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ ఉమ, రిజిస్టార్ రజని పేర్కొన్నారు. శనివారం ఎస్.పీ.ఎం విశ్వావిద్యాలయం నందు పలు సంస్థల సహకారంతో గ్రీన్ టీం విద్యార్థులకు సేంద్రియ ఎరువులు తయారీ విధానం వివరించారు. ప్రొఫెసర్లు రామమూర్తి, సావిత్రి, చాందికుమారి, రమ్య, ఎస్. ప్రోగ్రాం అధికారులు డా. రుక్మిణి, డా. హేమావతి పాల్గొన్నారు.