కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 3న ధర్నా

2038చూసినవారు
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 3న  ధర్నా
పలమనేరు మున్సిపల్ పారిశుద్ధ్యం ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గురువారం మధ్యాహ్నం కార్మికుల సమావేశం జరిగింది. సమావేశంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు, పలమనేరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మద్దెల సుబ్రహ్మణ్యం, పలమనేరు పట్టణ ఏఐటియుసి కార్యదర్శి మంజునాథబాబులు మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేస్తూ ప్రతి కార్మికునికి వివరాలు తెలియజేయాలని, ప్రతి సంవత్సరం కార్మికులకు యూనిఫారం ఆప్రాన్ , సోపు, నూనె, చెప్పులు, మంజూరు చేయాలని, కార్మికులకు పనిముట్లు సరఫరా చేయాలని , పారిశుద్ధ్య కార్మికులను కౌన్సిలర్లకు అప్పజెప్పడాన్ని విరమించుకోవాలని , పలమనేరు పట్టణం విస్తరణ పెరిగినందు వలన కార్మికులకు పనిబారం ఎక్కువ అయినందున్న అదనపు సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని , కార్మికులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలమనేరు మున్సిపల్ పారిశుద్ధ్య ఔట్సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్