వర్షాభావంతో వేరుశనగ రైతులకు అపారనష్టం

68చూసినవారు
వర్షాభావంతో వేరుశనగ రైతులకు అపారనష్టం
పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో వేరుశనగ పంట వేసిన రైతులకు అపారనష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఎకరాకు 25 వేల రూపాయల పెట్టుబడి ఖర్చు అయ్యిందని తెలిపారు. వర్షాధార పంటగా వేరుశనగ పంటను మెట్ట పొలాల్లో రైతులు సాగుచేస్తున్నారు. గత 20 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్