కె. వి పల్లి మండలం తిమ్మాపురంలో ఎస్సీ కార్పొరేషన్ రవీంద్రనాథ్ రెడ్డి వద్ద 2006 లో 43 ఎకరాలు కొనుగోలు చేసి 52 మంది ఎస్సీలకు మంజూరు చేశారు. సాగు చేయని భూమి ఆక్రమించుకుని రవీంద్రనాథ్ రెడ్డి ఎస్సీలను వేధిస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి ఆరోపించారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాలన్నారు.