Sep 20, 2024, 15:09 IST/
మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ కన్నుమూత
Sep 20, 2024, 15:09 IST
మలయాళ సీనియర్ నటి కవియూర్ పొన్నమ్మ (79) కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పొన్నమ్మ దాదాపు మలయాళంలో 700 సినిమాల్లో పైగా నటించారు. నటుడు మోహన్‌లాల్ సినిమాల్లో ఎక్కువగా తల్లి పాత్రలు పోషించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.