చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం జాతీయ న్యాయ సేవల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయవాదులు, ప్యారా లీగల్ వాలంటీర్లు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదువుతే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని తెలియజేశారు.