చిత్తూరు జిల్లా, పుంగనూరు మండల పరిధిలోని గూడూరుపల్లి సమీపంలో గల జగనన్న గృహాల సముదాయం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో భాస్కర్ రెడ్డి కుమారుడు ప్రకాష్ (30)కి చెవి తెగిపోయింది. వెంటనే స్థానికులు ప్రకాష్ ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల ద్వారా తెలియాల్సి ఉంది.