శ్రీసిటీ లాంటివి భారతదేశానికి మరో వంద కావాలంటూ నీతి ఆయోగ్ సీఈఓబీవీఆర్ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. గురువారం సాయంత్రం ఆయన సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ఛైర్మన్ శ్రీనిరాజు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీ ప్రత్యేకతలు, పారిశ్రామిక వృద్ధి సామర్థ్యాన్ని ఆయనకు వివరించారు.