సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం మండలం బత్తుల వల్లంలో రెండు ట్రాక్టర్లు ఒక జేసీబీని సీజ్ చేసినట్లు ఎస్ఐ మల్లికార్జున్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ చెదులపాకం రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు ట్రాక్టర్లు మట్టిని తరలిస్తూ పట్టుపడ్డారని చెప్పారు. ఎటువంటి బిల్లులు లేకుండా మట్టిని తరలిస్తుండడంతో ఎంఆర్ఓ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు చెప్పారు.