జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో సోమవారం రాత్రి ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో బతుకమ్మను కొలిచి ఆడి పాడి నేడు మహిళలు తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అనంతరం వాటిని డీజే వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి వాగు చెరువులలో నిమజ్జనం చేశారు.