శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బాపిరెడ్డి మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు చేపట్టిన తరువాత కలెక్టర్ ను కలిసి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు బాపిరెడ్డి వివరించారు.