వైసీపీ చేసిన పనులు చేస్తే తిరిగి మన ప్రభుత్వానికి అలాంటి గతే పడుతుందని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అన్నారు. శ్రీకాళహస్తిలోని ఆయన ఇంటి వద్ద బుధవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వస్తే ఘోరమైన పరిస్థితి వస్తుందన్న ఆందోళనతో ప్రజలు గొప్ప తీర్పుతో అధికారాన్ని కూటమి ప్రభుత్వానికి ఇచ్చారని పేర్కొన్నారు.